మొన్న ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రధాన గ్రంధాలయంలో “మిలియన్ మార్చ్ స్ఫూర్తిని గుర్తుచేసుకుందాం-ఉద్యమ ఆకాంక్షలను సాధిద్దాం” అనే అంశంపై విద్యార్థి నిరుద్యోగ మేధోమథన సదస్సును నిర్వహించారు. దానిలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం విద్యార్ధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కెసిఆర్ తన కొడుకు కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయడం కోసమే ధర్డ్ ఫ్రంట్ అనే సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. అయితే దేనికోసం పోరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొన్నామో ఆ ఆకాంక్షలేవీ నేటికీ తీరలేదు. తెరాస నేతలకు ఎంతసేపు ఎన్నికలు, పదవులు, అధికారం గురించి ఆలోచనలే తప్ప ప్రజాసమస్యలు పట్టించుకోవడంలేదు. కనుక తెలంగాణా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి అందరం మళ్ళీ మరోమారు పోరాడక తప్పదు. మిలియన్ మార్చ్ కు పోలీసులు అనుమతించకపోయినా కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతాము,” అన్నారు.