ఇవ్వాళ్ళ సాక్షి పత్రికలో 'గులాబీసేన వాట్స్ అప్!' అనే హెడ్డింగ్ తో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ స్థాపించి మోడీని డ్డీ కొనబోతున్నారు కనుక కేంద్రం తెరాసను ఎదురుదెబ్బ తీసేందుకు తన చేతిలో ఉన్న ఈడి, ఐటి, సిబిఐ సంస్థలను తెరాస మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలపైకి ఉసిగొలిపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారని పేర్కొంది. ఎవరైనా కేంద్రం ఉచ్చులో చిక్కుకొంటే వారిని కాపాడటం తన వల్ల కూడా సాధ్యం కాకపోవచ్చని కనుక తెరాస ప్రజాప్రతినిధులు అందరూ తమ జాగ్రత్తలో తాము ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారని సాక్షి పేర్కొంది. కనుక అందరూ వ్యక్తిగత ఆస్తుల విషయంలో, వ్యాపారాలు, కాంట్రాక్ట్ ల విషయంలో అలాగే రాజకీయ, పాలనాపరమైన విషయాల్లో అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని కెసిఆర్ హెచ్చరించారని సాక్షి పేర్కొంది. కేంద్రం ఉచ్చులో ఎవరు చిక్కుకొన్నా తెరాస పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం, అప్రదిష్ట కలుగుతుందని కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించినట్లు సాక్షి పేర్కొంది.
సాక్షి పత్రికలో వచ్చిన వార్త నిజమో కాదో తెలియదు కానీ అది వ్యక్తం చేసిన అనుమానాలు మాత్రం నిజమేనని చెప్పవచ్చు. మోడీ సర్కార్ ను డ్డీ కొంటున్నందుకు పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపిలను, ఒక మంత్రిని శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో నిందితులుగా పేర్కొంటూ సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తెరాస ప్రజా ప్రతినిధులపై కూడా సిబిఐ, ఐటి, ఈడి దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు.