తెరాస కూడా కేంద్రంపై యుద్దానికి సిద్దం?

March 02, 2018


img

ఈ నెల 5వ తేదీ నుంచి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో విభజన హామీలను అన్నిటినీ అమలుచేయాలని కోరుతూ ఏపి ఎంపిలు కేంద్రంతో యుద్ధం చేయడానికి సిద్దపడుతున్నారు. అందుకోసం తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని ఎంపిలు, ఇద్దరు కేంద్రమంత్రుల చేత రాజీనామాలు చేయిస్తామని హెచ్చరిస్తోంది. మరోపక్క ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ ఎంపిలు కూడా రాజీనామాలు చేస్తారని కోసం ఏపిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా హెచ్చరించింది. 

సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా రైతు సమన్వయ సమితి అవగాహనా సదస్సులలో మోడీ సర్కార్ వ్యవసాయ విధానాలను తప్పుపట్టారు. వాటిని సరిద్దిద్దేవరకు తమ ఎంపిలు కూడా పార్లమెంటులో మోడీ సర్కార్ తో గట్టిగా పోరాడుతారని అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణా భవన్ లో తెరాస పార్లమెంటరీ సమావేశం జరుగబోతోంది. ఒకవేళ దానిలో కూడా ఈ అంశంపై పోరాటం చేయాలని నిర్ణయిస్తే, రెండు తెలుగు రాష్ట్రాల ఎంపిల ఆందోళనతో లోక్ సభ స్తంభించిపోవచ్చు.


Related Post