బాబా...స్టార్టింగ్ ట్రబుల్ అధిగమించినట్లేనా?

January 02, 2018


img

సుమారు రెండు దశాబ్దాలపాటు రాజకీయాలలోకి ప్రవేశించాలా వద్దా అని ఊగిసలాడిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, మొన్న డిసెంబర్ 31న తను పార్టీ పెట్టి ఎంట్రీ ఇవ్వబోతున్నానని ప్రకటించిన తరువాత మరుసటి రోజే “రజినిమండ్రం.ఆర్గ్” అనే వెబ్ సైట్ ను ప్రారంభించేశారు. తన అభిమానులు, తనపై నమ్మకం ఉంది తను పెట్టబోయే పార్టీలో చేరాలనుకోవారు ఈ వెబ్ సైట్ ద్వారా తమపేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇక రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “మా సోదరుడు రజనీకి రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేయగల సత్తా ఉంది. ఈ నెల సంక్రాంతి పండుగలోపుగానే తన పార్టీ పేరును, పార్టీ గుర్తును, అజెండాను ప్రకటించే ఆవకాశం ఉంది,” అని చెప్పారు. ఇదివరకు రజనీకాంత్ తాను ఇప్పుడు రాజకీయాలలోకి రావలసిన పరిస్థితులు లేవని చెప్పినప్పుడు, అయన తప్పకుండా రాజకీయాలలోకి వస్తారని సత్యనారాయణ చెప్పారు. ఆయన చెప్పినట్లే వస్తున్నారు. కనుక సంక్రాంతిలోగా రజనీకాంత్ పార్టీ వివరాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉందనే భావించవచ్చు. రజనీకాంత్ స్పీడ్ అందుకోవడం చూస్తుంటే, ఆయన స్టార్టింగ్ ట్రబుల్ అధిగమించినట్లే కనిపిస్తున్నారు. మరి అయన సహా నటుడు కమల్ హాసన్ కూడా వేరేగా పార్టీ పెట్టి రాజకీయాలలోకి వస్తారో లేదో చూడాలి. 


Related Post