నేటి నుంచి తెలంగాణాలో టాట సేవా డేస్

December 15, 2017
img

తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేటి నుంచి ఈ నెల 23 వరకు ‘టాట సేవా డేస్’ పేరిట రాష్ట్రంలో తాము చేపట్టబోతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అమెరికాలో కూడా తాము అనేక సేవా కార్యక్రమాలను, బతుకమ్మ పండుగ, బోనాలు వంటి పండుగలను, ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని టాటా అధ్య క్షురాలు ఝాన్సీరెడ్డి చెప్పారు. 

ఈ సమావేశంలో టాటా సభ్యులు మోహన్‌, వంశీరెడ్డి, వెంకట్‌, జ్యోతి, ఈశ్వర్‌, టాటా సలహాదారు డాక్టర్‌ హరి, సమన్వయకర్త ద్వారకానాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంస్థ ఆశయాలను, చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు.  సేవా డేస్ పేరిట రాష్ట్రంలో చేపట్టబోతున్న సేవాకార్యక్రమాల వివరాలు:

డిసెంబర్ 15: యాదాద్రి భువనగిరి జిల్లాలోని సున్నిపెంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు నోటు పుస్తకాలు, స్కూలు బ్యాగులు పంపిణీ.

డిసెంబర్ 16: ఏలూరులో సదస్సు 

డిసెంబర్ 18: శంషాబాద్ వద్దగల జుకాల్ గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం.

డిసెంబర్ 19: వరంగల్ జిల్లా ఆత్మకూరులో రక్షిత మంచినీటి పధకం ప్రారంభోత్సవం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు నోటు పుస్తకాలు, స్కూలు బ్యాగులు పంపిణీ. వికలాంగులకు ఉచిత వైద్య చికిత్సలు.

డిసెంబర్ 21: కామారెడ్డి జిల్లా, నరసుర్లాబాద్ మండలం, నేమి గ్రామ సమీపంలోగల స్థానిక శ్రీ షిరిడి సాయి విశ్వకళ కళ్యాణ మండపంలో 20 మంది వైద్యనిపుణుల బృందంతో మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నారు. ఈ మెడికల్ క్యాంపులో ఆస్తమా, బిపి, షుగర్, వైరల్ ఫీవర్స్, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు జరిపి మందులు అందిస్తారు. ఈ మెడికల్ క్యాంప్ లో న్యూరాలజీ, ఆర్ధోపెడిక్, ఆప్తమాలజీ వైద్య నిపుణులు కూడా  పాల్గొని, నరాల వ్యాధులు, కీళ్ళు ఎముకల వ్యాధులు, కంటి వ్యాధులకు సంబంధించిన అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తారు. ఉదయం 10.00 నుంచి మద్యాహ్నం 12.00 వరకు ఈ మెడికల్ క్యాంప్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 3.30 వరకు అదే గ్రామంలో స్థానిక న్యూ స్కూల్ మైదానంలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది.  

డిసెంబర్ 23: అమెరికా తెలుగు సంఘం (ఆటా)తో కలిసి మాదక ద్రవ్యాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 5కె రన్. మాదాపూర్ లో గల శిల్ప కళావేదికలో ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం. అనంతరం అక్కడే కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Related Post