అమెరికాలో ఐసిస్ సానుభూతిపరులు?

December 12, 2017
img

సోమవారం ఉదయం న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ వద్ద జరిగిన చిన్న బాంబు విస్పోతనానికి పాల్పడిన వ్యక్తి ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడని పోలీసులు గుర్తించారు. అతని పేరు అఖాయేడ్ ఉల్లా. ఏడేళ్ళ క్రితం బంగ్లాదేశ్ నుంచి అమెరికా వచ్చి ఒక ఎలక్ట్రికల కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఐసిస్ ప్రచారానికి ప్రభావితుడైన అతను తను పనిచేస్తున్న సంస్థలోనే ఎవరికీ తెలియకుండా బాంబును తయారుచేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దానిని ఎప్పుడూ రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్ లో పేల్చి భారీ విద్వంసం సృష్టించాలనుకొన్నాడు. అందుకోసం ఆత్మాహుతి దాడికి సిద్దమయ్యాడు. కానీ ఆ బాంబు పేల్చలేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ ఘటనలో అతనే గాయపడి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటనలో అతని పొట్టభాగంలో కొంతమేరకు కాలింది. పోలీసులు అతనిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన తరువాత తమ అదుపులో తీసుకొన్నారు. 

ఈ ఘటనతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ వాదనలకు బలం చేకూరినట్లయింది. కనుక అయన తన వాదనలను మరొక్కసారి గట్టిగా వినిపించవచ్చు.  


Related Post