ఈరోజు సదస్సులో పాల్గోబోతున్న ఐటి దిగ్గజాలు

November 28, 2017
img

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో అమెరికాతో సహా దేశవిదేశాల నుంచి సుమారు 1,500 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. వారిలో ఐటెక్ యుఎస్ మరియు సెవెన్ టాబ్లెట్స్ వంటి ప్రముఖ సంస్థల సీఈఓ కిషోర్ ఖండవల్లి, డల్లాస్ లోని క్వాంట్ సిస్టమ్స్ సంస్థ సీఈఓ శశికాంత్ కనపర్తి, డల్లాస్ లోని సిగ్నిటి సంస్థ సీఈఓ సుధాకర్ పెన్నం ఇంకా అమెరికాలో ఐటిసర్వ్ సంస్థలో సభ్యులుగా ఉన్న అనేక ప్రముఖ ఐటి సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వారిలో ఐదుగురు మహిళా సీఈఓలు కూడా ఉన్నారు.

ఈ సదస్సులో పాల్గొంటున్నవారిలో చాలా మంది ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో నిరుపేద వ్యవసాయ, మధ్యతరగతి కుటుంబాలలో పుట్టిపెరిగినవారే. దాదాపు అందరూ హైదరాబాద్ లో చదువుకొన్నవారే. అందరూ తమ స్వయంశక్తి, కృషి, పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగి నేడు ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ఇవంకా ట్రంప్ పక్కన నిలబడి మాట్లాడగలుగుతున్నారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో యువతీయువకులు కూడా ఈరోజు జరుగబోయే సదస్సులో వారు చెప్పబోయే అంశాల గురించి శ్రద్దగా, క్షుణ్ణంగా తెలుసుకొని అర్ధం చేసుకొని, తాము కూడా వారి స్థాయికి ఎదిగేందుకు గల అవకాశాలను తెలుసుకోగలిగితే, ఈ సదస్సు యొక్క ప్రయోజనం నెరవేరుతుంది.  


Related Post