అయ్యో ఇంత దారుణమా?

November 24, 2017
img

ఏ మతానికి చెందినవారికైనా వారి ఆలయాలు, మశీదులు, చర్చ్, గురుద్వారాలు పరమపవిత్రమైనవని భావిస్తారు. కానీ అల్లాను నమ్ముతున్నామని చెప్పుకొనే ఐసిస్ ఉగ్రవాదులు మశీదులో ప్రార్ధనలు ముగించుకొని బయటకు వస్తున్న వారిపై మారణాయుధాలతో దాడులు చేసి మారణఖాండ సృష్టించడం చాలా కలచివేస్తుంది.      

ఈజిప్టులో సినాయ్ అనే ద్వీపకల్పంలో అరిష్ అనే పట్టణంలోని బిర్ అల్-అబెద్ లో గల ఒక మశీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని బయటకు వస్తున్నవారిపై నాలుగు వాహనాలలో బాంబులు, మెషిన్ గన్స్ తో వచ్చిన ఐసిస్ ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టి బాంబులు విసురుతూ, మెషిన్ గన్స్ తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమం సృష్టించారు. వారి దాడిలో ఏకంగా 184 మంది చనిపోయారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడానికి వచ్చిన అంబులెన్స్ లను కూడా విడిచిపెట్టకుండా వాటిపై కూడా ఐసిస్ ఉగ్రవాదులు మారణాయుధాలతో విచాక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఐసిస్ ఉగ్రవాదుల దాడిలో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే భద్రతాదళాలు అక్కడకు చేరుకొని వారిపై ఎదురుదాడి చేయడంతో ఉగ్రవాదులు పారిపోయారు. ఈజిప్ట్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మశీదులపై, ప్రార్ధనలు చేసుకొంటున్నవారిపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేయడం వారి రాక్షత్వానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. 

Related Post