న్యూయార్క్ లో ప్రత్యక్షమైన కిం జాంగ్ ఉన్

October 28, 2017
img

అమెరికాపై పగతో రగిలిపోతున్న ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిం జాంగ్ ఉన్, ఏ క్షణమయినా అమెరికా మీద అణుబాంబులు వేసి ప్రపంచపటంలో నుంచి తుడిచిపెట్టేస్తానని పదేపదే హెచ్చరిస్తుంటాడు. పిచ్చోడి చేతిలో రాయిలా అతని చేతిలో ఉన్న భయానకమైన అణుబాంబులను చూసి అమెరికా గడగడలాడుతోంది.  ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న డోనాల్డ్ ట్రంప్ కు కిం జాంగ్ ఉన్ సింహస్వప్నంలా మారాడు. ట్రంప్ కు కంటి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు.   

అటువంటిది కిం జాంగ్ ఉన్ నేరుగా అమెరికాలో దిగితే...? న్యూయార్క్ లోని నేరుగా ట్రంప్ టవర్స్ బిల్డింగులో ప్రవేశిస్తే...? అమెరికా ఏవిధంగా స్పందిస్తుంది? అమెరికన్లు ఏమి చేస్తారు? 

ఏమి చేయలేదు. అందరూ నవ్వుతూ షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకొన్నారు. ఆయన కూడా ఎవరినీ కాదనకుండా గంభీరంగా నిలబడి సెల్ఫీలు తీయించుకొన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అడ్డుచెప్పకపోవడంతో..వెనుక అంగరక్షకుడు వస్తుంటే న్యూయార్క్ వీధుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ దర్జాగా తిరిగారు. 

అయినా అందరూ ఆయనను చూసి సంతోషించారే తప్ప పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడానికి ప్రయత్నించలేదు...ఎందుకంటే ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ఉన్ కాదు...అయన పోలిన మనిషి. 

కిం జాంగ్ ఉన్ కు ఈ పెద్దమనిషి కలర్ జిరాక్స్ కాపీ అంత డిటోలా ఉన్నారు. ఆయన హెయిర్ కట్..డ్రెస్సు..నడక తీరు, హావభావాలు అన్నీ కిం జాంగ్ ఉన్ కు డిటో డిటో..అందుకే న్యూయార్క్ ప్రజలు అంతగా ముచ్చటపడి ఆయనతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఈ అమెరికన్ కిం జాంగ్ ఉన్ ని మీరూ ఓ లుక్కేసి అవునో కాదో చెప్పండి. 


Related Post