అమెరికాలో అంగరంగ వైభోగంగా దసరా ఉత్సవాలు

October 10, 2017
img

అమెరికాలోని  గ్రేటర్ ఫిలడెల్ఫియా ప్రాంతంలో  తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా టాటా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది.

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో నిర్వహించబడిన ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల ప్రాంతాలైన పెన్సిల్వేనియా, డెలావేర్, న్యూ జెర్సీ, న్యూయార్క్ మరియు మేరీల్యాండ్ నుండి సుమారు 1,000 మంది వరకు హాజరయి వేడుకలను విజయవంతం చేసారు. 

ఈ కార్యక్రమాలకు ప్రధాన అతిధిగా సెనేటర్ ఆండ్రూ డిన్నిమాన్, భారత్ నుంచి ముఖ్య అతిధిగా అర్జునరెడ్డి సినిమా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ హాజరయ్యారు. ఆండ్రూ డిన్నిమాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ దసరా మహోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సెనేటర్ ఆండ్రూ డినిమాన్ ఆహుతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలను తెలియజేసారు. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఏరియాలో టాట చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. భారతీయ సంస్కృతి మరియు టాట సేవా కార్యక్రమాల గురించి మరింత తెలుసుకునేందుకు ఆయన ఆసక్తిని కనబరిచారు. అంతేకాకుండా...టాట చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందిస్తూ టాటకు తన సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.

ఆ తరువాత సుమారు 100 మంది ఔత్సాహిక చిన్నారులు, యువతీయుకులు పాటలు, డ్యాన్స్ ప్రదర్శనలు, ఫాషన్ షో తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరినీ మెప్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు కూడా ఆద్యంతం ఈలలు చప్పట్లతో హోరెత్తిస్తూ సందడి చేస్తూ ప్రదర్శనలు ఇస్తున్నవారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమాలలో భాగంగా మన తెలంగాణ జానపద గాయకుడు కళాశ్రీ భిక్షు నాయక్ తన ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు.


ఈ సందర్భంగా స్థానికులతో కలిసి నిర్వాహుకులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ల్స్ ఒక జాతర వాతావరణాన్ని స్పురింపజేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిధులు వాటిని చూసి చాలా ఆనందించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఆహూతులందరికి నిర్వాకులు మంచి రుచికరమైన విందు భోజనాన్ని అందించారు. ఆతరువాత ఈ కార్యక్రమానికి హాజరైనవారు అక్కడ లభించిన ఉచిత ‘ఫ్లూ-షాట్స్’ ని తీసుకున్నారు.

టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి గారు ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ, అందరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలను తెలియచేసారు. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలని తమ సంస్థ ఏవిధంగా నిర్వహించిందో ఆమె వివరించారు. టాటా నిర్వహించబోయే 'సేవా డేస్' గురించి వివరించి, ఈ డిసెంబర్ నుంచి టాటా సేవలను తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్వహించబోతున్నామని తెలిపారు. వాటి కోసం తాము రూపొందించుకొన్న ప్రణాళికలను ఆమె ఆహుతులకు వివరించారు. అలాగే ఇంత పెద్ద సంబరాలను విజయవంతంగా నిర్వహించిన గ్రేటర్ ఫిలడెల్ఫియా టీం సభ్యులను టాటా తరుపున ఆమె ప్రత్యేకంగా అభినందించారు. 

టాటా సలహా మండలి చైర్ పర్సన్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిగారు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలను తెలియచేసారు. 

స్మితా పెద్దిరెడ్డి మరియు సుమన్ ప్రశాంతి గారు ఈ సంబురాలని మొదటి నుంచి చివరి వరకు అందరినీ ఆకట్టుకొనే విధంగా చాలా చక్కగా నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో టాటా గ్రేటర్ ఫిలడెల్ఫియా ఆర్గనైజింగ్ టీం బోర్డు అఫ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, రీజినల్ వైస్ ప్రెసిడెంట్- (పి.ఎ.) ప్రసాద్ కునారపు మరియు రమణ రెడ్డి కొత్త, రీజినల్ వైస్ ప్రెసిడెంట్- (డిఈ) వేణు ఏనుగుల మరియు భాస్కర్ పిన్న పాల్గొన్నారు. 

ఇంకా వంశీ గుళ్ళపల్లి , శశి కసిర, అమర్ వెల్మల, యాది, కిరణ్ గూడూరు, నిషీల్ గార్దస్, జనార్దన్ బద్దం, సతీష్ సుంకనపల్లి, స్వామి బొడిగె, కవిత తాటికొండ, వేణు బత్తిని, శివా రెడ్డి, రాజేష్ ఆలేటి, సత్య ముదిరెడ్డి మరియు నాగార్జున యాడ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారు. 

Related Post