అమెరికాలో పేద విద్యార్ధులకు తానా సహాయం

September 28, 2017
img

‘అమెరికా అంటే అభివృద్ధి చెందిన దేశం. అక్కడ రోడ్లు ఊడ్చేవారికి కూడా కార్లు, ఏసీలు ఉంటాయి. కనుక ఏదో విధంగా అమెరికాలో వెళ్ళిపడితే చాలు..బోలెడు డబ్బు సంపాదించేసుకోవచ్చు..’ అని చాలా మంది భారతీయులు భావిస్తుంటారు. అది కొంతవరకు నిజమే కానీ ప్రపంచాన్ని శాశిస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో కూడా కటిక దారిద్యం అనుభవిస్తున్న లక్షల మంది నిరుపేదలున్నారంటే బహుశః ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం. 

అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడి తమ జీవితాలను తీర్చిదిద్దుకొన్న భారతీయులు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. తమకు అంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన అమెరికాకు కృతజ్ఞతగా వారు ఆ దేశంలోని నిరుపేద ప్రజలకు తమవంతుగా యధాశక్తిన సహాయసహకారాలు, సేవలు అందిస్తూనే ఉన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో మిడ్-అట్లాంటిక్ రీజియన్ సభ్యులు ‘గివింగ్ బ్యాక్ టుద కమ్యూనిటీ’ అనే పేరుతో సెప్టెంబర్ 26న ఫిలడెల్ఫియాలోని భార్ట్రాం హైస్కూలులో నిరుపేద విద్యార్ధులకు స్కూలు బ్యాగులు, పుస్తకాలు  మరియు ఇతర వస్తువులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో తానా తరపున హరీష్ కోయ, రవి పొట్లూరి, నాగరాజు నలజల, వేణు సంగాని, రవి మండలపు, జగదీశ్ రెడ్డి అనుముల మరియు ఆ స్కూల్ ప్రిన్సిపల్ డైమండ్ వారెన్, ఆ స్కూలు అధ్యాపకురాలు రజిత మాలే తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డైమండ్ వారెన్ తానా సభ్యులను వారందిస్తున్న సేవలను కొనియాడారు. ఆ స్కూల్లో విద్యార్ధుల అవసరాలను తెలుసుకొని తమకు తెలియజేసి ఈ సత్కార్యక్రమానికి సహకరించినందుకు తానా సభ్యులు జగదీశ్ రెడ్డి అనుములను, ఆ స్కూల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న రజిత మాలే మరియు ఇతర ఉపాద్యాయులను తానా సభ్యులు అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.  


Related Post