క్షిపణి ప్రయోగం చేసిన అమెరికా

August 31, 2017
img

ఉత్తర కొరియా మొన్న మంగళవారం జపాన్ మీదుగా పసిపిక్ మహాసముద్రంలో పడే విధంగా క్షిపణి ప్రయోగం చేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఇంతవరకు చాలా సంయమనం పాటిస్తున్న అమెరికా ఉత్తరకొరియాకు ఇక మాటలతో హెచ్చరిస్తే సరిపోదని భావించి బుధవారం అమెరికాలోని హవై తీరం నుంచి ఒక ఎం-6 అనే క్షిపణిని ప్రయోగించింది. అమెరికా రక్షణ శాఖ, నావికాదళం అధ్వర్యంలో జరిగిన ఈ పరీక్ష విజయవంతం అయ్యిందని రక్షణశాఖ ప్రకటించింది. ఆ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే, అతితక్కువ సమయంలోనే శత్రుదేశాలు ప్రయోగించిన క్షిపణిని ఎదుర్కొని నాశనం చేస్తుంది.       


Related Post