యూకెలో ఘోర ప్రమాదం: 8 మంది భారతీయులు మృతి

August 28, 2017
img

బ్రిటన్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానిలో భారత ఐటి దిగ్గజం విప్రో సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 5 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన బకింగ్ హామ్ షైర్ లోని న్యూపోర్ట్ పాగ్నేల్ అనే ప్రాంతంలో జరిగింది. 

విప్రో సంస్థలో చేస్తున్న ఐటి ఉద్యోగులు కొందరు వారి కుటుంబాలతో కలిసి వారాంతపు శలవులలో విహారయాత్రకు బయలుదేరినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న మినీబస్సును ఎదురుగా వస్తున్న ఒక లారీడ్డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ఆ సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో విప్రో ఉద్యోగులు కార్తికేయన్ రామ సుబ్రహ్మణియం, ఆయన భార్య, రిషి రాజీవ్ కుమార్, వివేక్ భాస్కర్ చనిపోయారు. ఈ ప్రమాదంలో విప్రో ఉద్యోగి    మనో రంజన్ పన్నీర్‌ సెల్వమ్, ఆయన భార్య సంగీత, వారి 5 సం.ల కుమార్తె గాయపడగా, పన్నీర్ సెల్వం తల్లి తండ్రులు, మావగారు ఈ ప్రమాదంలో మరణించారు. మినీ బస్ డ్రైవర్ సిరియాక్ జోసఫ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఆసుపత్రిలో ఉన్న మరో వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. చనిపోయిన, గాయపడిన వారు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే.

విప్రో యూకె-యూరోప్ ఆపరేషన్స్ హెడ్ రమేష్ ఫిలిప్స్ ఈ ఘోరదుర్ఘటనపై స్పందిస్తూ, “ఇది నిజంగా చాలా బాధాకరం. మా సంస్థ తరపున భాదిత కుటుంబాలకు అన్నివిధాల అవసరమైన సహాయసహకారాలు అందిస్తాము,” అని చెప్పారు. 

Related Post