అమెరికా బుజ్జగింపులను, అది చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఉత్తర కొరియా మళ్ళీ శనివారం క్షిపణి ప్రయోగం చేసింది. ఈసారి తక్కువ సామర్ధ్యం కలిగిన మూడు క్షిపణులను ప్రయోగించినట్లు కనుగొన్నామని దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని అమెరికా, కొరియా ఇరుదేశాల సైన్యాల అధిపతులు ప్రకటించారు. అవి సుమారు 250 కిమీ పరిధిలో లక్ష్యాలను చేధించగలవని అయితే వాటిలో రెండు లక్ష్యాలను చేధించలేకపోయాయని తెలిపింది. ఉత్తరకొరియా ఈరోజు చేసిన ఈ క్షిపణి ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా స్పందించవలసి ఉంది.