ట్రంప్ దెబ్బకు తోక ముడిచిన ఉత్తర కొరియా

August 17, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర హెచ్చరికలతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ వెనక్కు తగ్గినట్లే కనబడుతున్నారు. అమెరికా అధీనంలో ఉన్న  గువామ్ ద్వీపంపై క్షిపణి దాడిని వాయిదా వేసుకొంటున్నామని ఉత్తర కొరియా అధికార మీడియా మంగళవారం ప్రకటించింది. అమెరికా మరిన్ని తప్పులు చేసే వరకు ఓపికగా ఎదురుచూస్తాం,” అని ఆ ప్రకటనలో పేర్కొంది. 

దాని ప్రకటనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి టిల్లర్ సన్ స్పందించిన తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ట్రంప్ స్పందిస్తూ “కిమ్ జాంగ్ ఉన్ చాలా తెలివైన, సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. గువాం ద్వీపంపై క్షిపణి దాడి చేయాలనే ఆలోచన చాలా విపత్కరం..ఎవరికీ ఆమోదయోగ్యం కాదు కూడా,” అని ట్వీట్ చేశారు.

విదేశాంగ మంత్రి టిల్లర్ సన్, “అమెరికా ఇప్పటికీ ఉత్తర కొరియాతో చర్చలకు సిద్దంగానే ఉంది,” అని ట్వీట్ చేశారు.

ఉత్తర కొరియా అమెరికాకు భయపడి వెనక్కు తగ్గినప్పటికీ చాలా మొరటుగా మాట్లాడింది కానీ అమెరికా మాత్రం నేటికీ చాలా సంయమనం పాటిస్తూ దౌత్యబాషలో చాలా మర్యాదగా స్పందించింది. అయితే యుద్దోన్మాది అయిన కిమ్‌ జాంగ్‌ ఉన్‌ వలన ఎప్పటికైనా ప్రమాదమే. ఏదోరోజున మళ్ళీ క్షిపణి ప్రయోగాలు చేయడం తధ్యం. యుద్దానికి సవాళ్లు విసరడం కూడా తధ్యం.

Related Post