మేము యుద్దానికి రెడీ: ట్రంప్

August 11, 2017
img

ఉత్త‌ర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చేస్తున్న యుద్దప్రకటనలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా ధీటుగా స్పందించారు. “ఉత్తర కొరియా మాపై దాడికి ప్రయత్నిస్తే దానిని ఎదుర్కొని త్రిప్పి కొట్టడానికి మా సైన్యం ఆయుధాలతో సిద్దంగా ఉంది. కనుక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వేరే మార్గం ఏదైనా చూసుకొంటే మంచిది,” అని ట్రంప్ ట్వీట్ చేశారు.

అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపంపై అణుమిసైళ్ళతో దాడి చేయబోతున్నామని, వాటిని అడ్డుకొంటే అమెరికాపై కూడా అణుబాంబులు వర్షం కురిపించి సర్వనాశనం చేస్తామని ఉత్త‌ర కొరియా చేసిన హెచ్చరికల నేపధ్యంలో డోనాల్డ్ ట్రంప్ ఈ విధంగా స్పందించారు. 

ఇంతవరకు అమెరికా చాలా సంయమనంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తాము కూడా యుద్దానికి సిద్దంగా ఉన్నామని ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో ఏ క్షణానైనా యుద్ధం ప్రారంభం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ ఉత్త‌ర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈసారి ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడినా లేదా దుస్సాహసం చేసినా అమెరికా సేనలు ఈసారి ఉపేక్షించకపోవచ్చు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై ఉత్త‌ర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇంకా స్పందించవలసి ఉంది. 

ట్రంప్ ఏమని ట్వీట్ చేశారంటే:

  


Related Post