హైదరాబాద్ రానున్న ఇవాంకా ట్రంప్

August 11, 2017
img

ఈ ఏడాది నవంబర్ 28వ తేదీ నుంచి భారత్-అమెరికా సంయుక్తంగా హైదరాబాద్ లో నిర్వహించానున్న గ్లోబల్ ఎంటర్ప్రీన్యుర్ షిప్ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకాబోతున్నారు. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా నిన్న రాత్రి ట్వీట్ ద్వారా తెలియజేశారు. భారత్-అమెరికాలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం కోసమే హైదరాబాద్ లో ఈ మూడు రోజుల సదస్సు నిర్వహించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశవిదేశాలలోని తన వ్యాపార బాధ్యతలను తన పిల్లలకు అప్పజెప్పారు. కనుక ఇవాంకా ట్రంప్ ఒక వ్యాపారవేత్త హోదాలో వస్తున్నట్లే భావించవచ్చు. కనుక ఆమె భారత్ లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశ్యంతోనే వస్తున్నట్లు భావించవచ్చు.    


Related Post