భారత్-ఇజ్రాయిల్ మద్య ఏడు ఒప్పందాలు

July 05, 2017
img

ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా భారత్ఇజ్రాయెల్ దేశాల మద్య ఏడు ఒప్పందాలు జరిగాయి. 

1. 40 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారత్ లో ఒక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. దానిలో ఇరుదేశాల శాస్త్రజ్ఞులు కలిసి పనిచేస్తారు. శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష, రక్షణ రంగాలలో భారత, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకొన్నారు కనుక వారిప్పుడు కలిసి పనిచేస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది. 

2. భారత్ లో జల సంరక్షణ, వినియోగం, వ్యవసాయ రంగాలలో నేటికీ ఇంకా పాత పద్దతులే అమలులో ఉన్నాయి. ఆ మూడు రంగాలలో ఇజ్రాయెల్ అనేక అద్భుతాలు సృష్టించింది. వచ్చే ఏడాది నుంచి మూడేళ్ళ పాటు ఆ మూడు రంగాలలో భారత్ కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సహాయసహకారాలు అందిస్తుంది. 

3. ఆటామిక్ క్లాక్స్, జి.ఈ.ఓ, ఎల్.ఈ.ఓ. ఆప్టికల్ లింకింగ్ లో సహాయ సహకారాలు అందిస్తుంది. 

4. చిన్న ఉపగ్రహాల కోసం అవసరమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. 


Related Post