అమెరికాలో మరో భారతీయుడిపై కాల్పులు

June 14, 2017
img

అమెరికాలో విదేశీయులపై జాత్యాహంకార దాడులు కొంత తగ్గుముఖం పట్టినట్లే ఉన్నాయి కానీ డబ్బు కోసం అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి  అట్లాంటాలో గల సమీర్ స్టోర్స్ లోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ లో నగదును దోచుకొన్నారు. ఆ ప్రయత్నంలో వారు కాల్పులు జరుపగా అక్కడ పనిచేస్తున్న హస్ ముఖ్ పటేల్ (24) అనే భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులు నగదు దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో వారు అతనిపై కాల్పులు జరిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

బిహార్ రాష్ట్రంలో పాట్నా సమీపంలో సుంధేర్ గ్రామానికి చెందిన హస్ ముఖ్ పటేల్ మూడేళ్ళ క్రితమే అమెరికా వెళ్ళి ఆ దుఖాణంలో చేరాడు. అప్పటి నుంచి అతను అక్కడే పనిచేస్తున్నాడు. అమెరికాలో ఇటువంటి దోపిడీ సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి కనుక ఈ దాడిని జాత్యాహంకార దాడిగా భావించలేము. అతని స్థానంలో అమెరికన్ ఉన్నా దుండగులు అదేవిధంగా చేసి ఉండేవారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Related Post