ట్రంప్ కు మళ్ళీ ఎదురుదెబ్బ

June 13, 2017
img

అందరి అంచనాలను తారుమారుచేస్తూ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి సుమారు 6 నెలలు కావస్తోంది. నేటికీ ఆయనలో ఇంకా అదే దూకుడు కనిపిస్తోంది. ఆ కారణంగా న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తప్పడం లేదు ఇంతా బయటా విమర్శలు తప్పడం లేదు. లిబియా, సిరియా, సోమాలియా, యెమెన్, ఇరాన్, సూడాన్ దేశాలపై మూడు నెలలపాటు విధించిన తాత్కాలిక నిషేధంపై దిగువ కోర్టులు విధించిన స్టే ఆదేశాలను తొలగించాలంటూ అమెరికా ప్రభుత్వం చేసిన అప్పీలును అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తిరస్కరించింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ అమెరికా చట్టాలకు విరుద్దంగా వాటిని ఉల్లంఘిస్తున్నట్లు ఉందని కనుక దానిని పునరుద్దరించలేమని తీర్పు చెప్పింది. దీంతో మళ్ళీ ఆ ఆరు దేశాలపై విధించిన నిషేదాజ్ఞాలు పూర్తిగా తొలగిపోయినట్లే కనుక మళ్ళీ ఆ ఆరు దేశాల నుంచి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే అమెరికా వెళ్ళాలనుకొంటున్న భారతీయులను హెచ్1-బి వీసాలను నియంత్రించడం ద్వారా నియంత్రించినట్లే ఆ దేశాల నుంచి వచ్చేవారిని కూడా నియంత్రించే అవకాశం ఉంది. 


Related Post