బ్రిటన్ లో హంగ్ పార్లమెంటు

June 09, 2017
img

బ్రిటన్ పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో హంగ్ పార్లమెంటు ఏర్పడింది. మొత్తం 650 స్థానాలున్న పార్లమెంటులో 654 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. వాటిలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 315 స్థానాలు రాగా ప్రధాన ప్రతిపక్ష లేబర్ పార్టీకి 261 స్థానాలు లభించాయి. ఎస్.ఎన్.పి.కి-35, లిబరల్ డెమొక్రాట్లకు-12, ఇతరులకు 23 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 326 సీట్లు అవసరం ఉంటుంది. కానీ అధికార కన్జర్వేటివ్ పార్టీకి 315 స్థానాలు మాత్రమే దక్కడంతో మరో 11 మంది సభ్యుల మద్దతు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని ధేరిసా మే మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం దేశానికి సుస్థిరపాలన చాలా అవసరం కనుక మేము ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. నేను నా పదవికి రాజీనామా చేయాలనుకోవడం లేదు,” అని అన్నారు.

కన్జర్వేటివ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రజాతీర్పు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉందనే సంగతి ప్రధాని ధేరిసా మే గ్రహించి, తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరేమి కోర్బిన్ డిమాండ్ చేశారు. కానీ ఇతర ఎంపిల మద్దతుతో మళ్ళీ కన్జర్వేటివ్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Related Post