మూడో ప్రపంచయుద్ధం తప్పదా?

May 15, 2017
img

అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఉత్తర కొరియా ఆదివారం క్షిపణి ప్రయోగం నిర్వహించింది. అణు వార్ హెడ్స్ ను మోసుకుపోగల హ్వాసంగ్ అనే ఆ క్షిపణి సుమారు 2000కిమీ ప్రయాణించి జపాన్ సముద్రజలాలలో పడింది. ఈ క్షిపణి ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ అది విజయవంతం అయినట్లు ప్రకటించారు. ఈ ప్రయోగంతో అమెరికాను రెచ్చగొట్టి తిరిగి తమను రెచ్చగొట్టేందుకు అమెరికా ఏ చిన్న ప్రయత్నం చేసినా ఆ దేశంపై అణుబాంబులతో దాడి చేస్తామని..అది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నిలిచిపోతుందని హెచ్చరించారు. 

అయితే మొదట అణ్వస్త్రపరీక్ష నిర్వహిస్తామని చెప్పిన ఉత్తర కొరియా అధ్యక్షుడు క్షిపణి పరీక్షతో సరిపెట్టడం గమనిస్తే అమెరికా హెచ్చరికలను చూసి కొంచెం వెనక్కు తగ్గినట్లే ఉన్నారు. అలాగే దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సేనలు, అధికారులు, కొరియా సముద్రజలాలలో తిష్ట వేసున్న అమెరికా యుద్దనౌకలు తక్షణమే వెనక్కు వెళ్ళిపోవాలని లేకుంటే, క్షిపణులను ప్రయోగించి ద్వంసం చేస్తామని కిం జోంగ్ బెదిరించిన కిం జోంగ్ ఉన్ ఇప్పుడు ఆ ఊసు ఎత్తక పోవడం గమనిస్తే కొంచెం వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారు. ఉత్తర కొరియా చేస్తున్న ఈ కవ్వింపు చర్యలపై అమెరికా ఇంకా స్పందించలేదు. దీనినీ ఉపేక్షించిది పరువాలేదు. కాదని ఉత్తర కొరియాపై దాడికి ప్రయత్నిస్తే మూడో ప్రపంచ యుద్ధం ఆరంభం అయిపోతుంది. 

Related Post