చైనా దుశ్చర్యలని భారత్ కట్టడి చేయలేదా?

April 19, 2017
img

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనా దానిపై తన సార్వభౌమాధికారాన్ని చాటుకొనేందుకు ఆ రాష్ట్రంలో ఆరు పట్టణాలకు కొత్త పేర్లను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగంగా ఉన్న టిబెట్ భూభాగమని, దానిపై తమ సార్వభౌమాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరని చైనా అధికారిక మీడియా పేర్కొంది. 

బౌద్ద గురువు దలైలామా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడానికి భారత్ అనుమతించినందుకు చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ అయనను అనుమతిస్తే తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కానీ దలైలామా ఆధ్యాత్మిక పర్యటనపై అనవసరమైన రాజకీయాలు చేయవద్దని భారత్ హితవు పలికి, దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేసింది. ఆయన నిరాటంకంగా తన పర్యటన ముగించుకొని వచ్చారు. దానితో చైనా భారత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ముందుగా హెచ్చరించినట్లుగానే అరుణాచల్ ప్రదేశ్ లో 6 పట్టణాలకు కొత్త పేర్లు ప్రకటించి అవి తమ భూభాగంలోనివేనని భారత్ కు బలమైన హెచ్చరికలు పంపించింది. దీనిపై భారత్ ఇంకా స్పందించవలసి ఉంది.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా చేపట్టినప్పటి నుంచి భారత్ కు పదేపదే సవాళ్ళు విసురుతున్న చైనా,పాకిస్తాన్ దేశాలతో చాలా కటినంగా, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి మిత్రదేశాలతో చాలా స్నేహంగా, ఉదారంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కనుక చైనాకు చాలా ధీటుగానే జవాబుచెప్పవచ్చు.      


Related Post