బ్రిటన్ పార్లమెంటుపై ఉగ్రవాది దాడి

March 23, 2017
img

బ్రిటన్ పార్లమెంటుపై బుధవారం ఒక గుర్తు తెలియని ఉగ్రవాది దాడికి ప్రయత్నించి భద్రతాదళాల కాల్పులలో మరణించాడు. 

మొదట అతను లండన్ లోని ధేమ్స్ నదిపై ఉన్న వంతెనపై వెళుతున్న ప్రజలపైకి తన కారును నడిపించడంతో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు.. ముగ్గురు మరణించారు. ఆ తరువాత అతను అక్కడి నుండి నేరుగా బ్రిటన్ పార్లమెంటువైపు దూసుకుపోయి తన కారుతో పార్లమెంటు గేట్లను గుద్ధించి లోపలకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరకపోవడంతో కారు దిగి తనను అడ్డుకొన్న భద్రతాధికారిని కత్తితో పొడిచి చంపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదిసిబ్బంది అతనిని కాల్చి చంపాయి. 

ఆ సమయంలో బ్రిటన్ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని తెరెసా మే కూడా పార్లమెంటులోనే ఉన్నారు. ఆమెను భద్రతాసిబ్బంది సురక్షిత మార్గం గుండా బయటకు తరలించారు. మిగిలిన పార్లమెంటు సభ్యులను కూడా లోపల సురక్షితమైన ఛాంబర్ లోకి తరలించారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని నిన్న పార్లమెంటు సమావేశాలను రద్దు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు పరిసర ప్రాంతాలను భద్రతాదళాలు చుట్టుముట్టి ఆణువణువూ గాలించి మరెవరూ ఉగ్రవాదులు లేరని నిర్ధారణ చేసుకొన్నాయి. కనుక నేటి నుంచి యధావిధిగా పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో భారత్ కు చెందినవారెవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ఈ దాడిని భారత్ తో సహా చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. 

Related Post