పట్టువదలని విక్రమార్కుడు ట్రంప్!

March 07, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా అధికారం చేపట్టిన తరువాత ‘ట్రావెల్ బ్యాన్’ అనే  బేతాళుడిని భుజానికెత్తుకొని, ప్రజలు, అధికారుల నుంచి ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా, న్యాయస్థానాల నుంచి ఎన్ని ఎదురవుతున్న ఎదురుదెబ్బలు తింటున్నా పట్టు వదలని విక్రమార్కుడిలాగ ముందుకే సాగుతున్నారు. 

మళ్ళీ నిన్న తాజాగా 6 ముస్లిం దేశాలకు చెందిన పౌరులను 3 నెలల పాటు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తీవ్ర సంక్షోభంలో చిక్కుకొన్న సిరియా వంటి దేశాల నుంచి శరణార్ధులు 4 నెలల పాటు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విదించారు.

నిషేధం విదించబడిన దేశాలు: సిరియా, లిబియా, సోమాలియా, ఇరాన్, సూడాన్, యెమెన్.

మినహాయింపులు: ఇదివరకు ఇరాక్ పై కూడా నిషేదం విదించబడింది. కానీ ఈసారి దానికి మినహాయింపు నిచ్చారు. ఆ 6 దేశాలకు చెందిన పౌరులలో అమెరికా రావడానికి ఇప్పటికే అన్ని అనుమతులు పొంది ఉన్నవారికి, గ్రీన్ కార్డ్స్ కలిగినవారికి మినహాయింపు. శరణార్ధులకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. 

సిరియా శరణార్ధుల ప్రవేశంపై విధించిన నిరవధిక నిషేధం ఎత్తివేసి, దాని స్థానంలో ఏడాదికి 50,000 మంది శరణార్ధులను మాత్రమే అమెరికాలో ప్రవేశానికి పరిమితి విధించారు. తాజా నిషేధం మళ్ళీ న్యాయపరమైన సమస్యలు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతో ముస్లిం, క్రీస్టియన్ అనే పదాలను తొలగించారు. 

ఈ నిషేధాలు మార్చి 16 నుంచి అమలులోకి వస్తాయి. 

Related Post