మళ్ళీ ట్రంప్ ట్రావెల్ బ్యాన్?

March 06, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై మూడు నెలలపాటు విదించిన నిషేధాన్ని (ట్రావెల్ బ్యాన్)  అమెరికా సుప్రీంకోర్టు సైతం తిరస్కరించినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈరోజు మళ్ళీ మరోసారి తాజాగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. క్రిందటిసారి ఇచ్చిన ఉత్తర్వులలో గల చట్టపరమైన లోపాలను సవరించి న్యాయస్థానాలలో మళ్ళీ ఎదురుదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారని సమాచారం. డోనాల్డ్ ట్రంప్ ఇవ్వాళ్ళ హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్టమెంట్ కు వెళ్ళి తాజా ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయబోతున్నారు. ఈసారి ట్రంప్ ఎవరి నెత్తిన బాంబు పేల్చబోతున్నారో మరికొన్ని గంటలలో తెలుస్తుంది.

Related Post