తానా అధ్యక్ష పదవి బరిలో జయ్ తాళ్ళూరి

February 23, 2017
img

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కు 40 ఏళ్ళ ఘన చరిత్ర ఉంది. అది నానాటికీ ఇంకా బలపడుతూనే ఉంది. విదేశాలలో ఒక సంస్థను ఇంత సుదీర్గకాలంపాటు విజయవంతంగా నడిపించగలగడం సామాన్యమైన విషయమేమీ కాదు. తానా సభ్యులు సరైన సారధులను ఎంచుకోవడంలో చూపిస్తున్న విజ్ఞత కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. మళ్ళీ వారు తానాకు కొత్త రధసారధులను ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమయింది. 

తానా సభ్యులందరికీ చిరపరిచితులైన శ్రీ జయ్ తాళ్ళూరి ఈసారి తానా కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఐటి సర్వ్ నార్త్ ఈస్ట్ కు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షులు. డిస్ట్రిక్ట్ ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ లో జయ్ తాళ్ళూరి వ్యవస్థాపక సభ్యులు. 

జయ్ తాళ్ళూరి అర్ధాంగి పేరు శ్రీమతి నీలిమ. వారికి సాయి పంచాక్షర్, భావన అనే ఇద్దరు సంతానం. జయ్ తాళ్ళూరి న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో నివాసం ఉంటున్నారు. జయ్ తాళ్ళూరి సోదరుడు డాక్టర్ శ్రీ రాజ తాళ్ళూరి, సోదరి డాక్టర్ శ్రీమతి గొట్టిపాటి అనిత ఇద్దరూ కూడ అమెరికాలో ప్రముఖ వైద్యులు కనుక చాలా మందికి వారు చిరపరిచితులే.

60 మిలియన్లకు పైగా విలువగల సుప్రసిద్ధ హాల్ మార్క్ గ్రూప్ సంస్థలను జయ్ తాళ్ళూరి స్థాపించారు. తాళ్ళూరి టెక్స్ టైల్స్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి ఉద్యోగాలు పరోక్షంగా అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నారు. 

జయ్ తాళ్ళూరికి తానాతో 16 ఏళ్ళ సుదీర్గ అనుబందం ఉంది. తానాకు అనేక హోదాలలో సేవలు అందించిన సంగతి తెలిసిందే. 2013-15సం.లలో తానా ఫౌండేషన్ చైర్మన్ గా చేసిన జయ్ తాళ్ళూరి చేపట్టిన పలు సేవా కార్యక్రమాల కోసం 50, 000 డాలర్లు సేకరించి దానికి తాళ్ళూరి సోదరులిద్దరూ తమ స్వంత డబ్బు 250,000 డాలర్లు కలిపి అందించారు. 

‘వారధి’ పధకం ద్వారా 560 మంది అనాధపిల్లలకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పించారు. ‘మన వూరి కోసం’ అనే పధకం కోసం ఆర్.డి. పద్ధతిలో నిధులు ఏర్పాటు చేశారు. ఆ రెండేళ్ళ వ్యవధిలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో క్యాన్సర్, గుండె జబ్బులు, కంటి జబ్బులు, గ్రహణం మొర్రి భాదితుల కోసం అనేక వైద్య శిబిరాలు నిర్వహించారు. 

ఇక భద్రాచలం, విశాఖ, కర్నూలు, జిల్లాలో జయ్ తాళ్ళూరి గత రెండు దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భద్రాచలంలోని జూనియర్ కాలేజీకు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. గత 11 సం.లుగా ఏటా 150 మంది పేదవిద్యార్ధులకు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొనేందుకు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఆరు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఉదారంగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. వాటిలో లైబ్రేరీలను కూడా ఏర్పటు చేశారు. గిరిజన ప్రభుత్వ పాఠశాలలకు రూ.35 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సామగ్రి వగైరా అందించారు జయ్ తాళ్ళూరి. 

విశాఖ జిల్లాలో కొరువాడ మండలంలో ప్రజలు త్రాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలుసుకొని గ్రామంలో బోర్లు తవ్వించి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశారు. జయ్ తాళ్ళూరి స్వంత మండలం బూర్లపాడులో మహిళలకు స్కిల్ డెవెలప్మెంట్ కోసం 3 శిక్షణా సంస్థలు ఏర్పాటు చేశారు. 500 మరుగుదొడ్లను నిర్మించారు. భద్రాచలం, తూర్పు గోదావరి జిల్లాలలో వృద్దాశ్రమం, అనాధ శరణాలయాలు నిర్మించి వాటి నిర్వహణకు ఆర్ధికసహాయం అందిస్తున్నారు. ఇవి కాక గత రెండు దశాబ్దాలుగా ఇంకా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

ఇటువంటి సేవాభావం, కార్యదక్షత గల జయ్ తాళ్ళూరికి తానా కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎన్నుకొన్నట్లయితే తానా ఆశయాలకు అనుగుణంగా మరింత కృషి చేసి తానా సభ్యులందరూ గర్వపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించగలనని చెపుతున్నారు. అమెరికాలో ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్న అనేక సవాళ్ళను, సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవాలంటే తానా మరింత బలపడవలసి ఉంటుంది. ఆ బాధ్యతను స్వీకరించడానికి ముందుకు వచ్చిన తనకు తానా సభ్యులందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా జయ్ తాళ్ళూరి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Related Post