అమెరికాలో ఏరివేత ప్రారంభం!

February 23, 2017
img

డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దేశంలో నివసిస్తున్న విదేశీయులపై మళ్ళీ మరోమారు కొరడా ఝుళిపించింది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని పట్టుకొని తిరిగి స్వదేశానికి పంపించే పని మొదలుపెట్టింది. దాని కోసం హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి జాన్ కెల్లీ మంగళవారం రెండు జీవోలను జారీ చేశారు. వాటిని తక్షణమే అమెరికన్ పోలీసులు అమలుచేయడం మొదలుపెట్టేశారు.  

వాటి ప్రకారం సరైన ధ్రువ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొంటున్నవారిని పట్టుకొని స్వదేశాలకి తిప్పి పంపించేస్తారు. నేర చరిత్ర ఉన్నవారిని లేదా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిని మాత్రమే గుర్తించి పంపించివేస్తామని ట్రంప్ ప్రభుత్వం చెపుతున్నప్పటికీ, అక్రమవలసదారులను వదిలించుకోవడమే దాని లక్ష్యం గాబట్టి, దొరికినవారినందరినీ ఏదో ఒక నెపంతో వెనక్కి తిప్పి పంపేయడం ఖాయమేనని భావించవచ్చు. 

అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు కోటి యాభై లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వారిలో భారతీయులు సుమారు 3 లక్షల మంది వరకు ఉన్నారు. అత్యధికంగా పొరుగునే ఉన్న మెక్సికో దేశస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సరైన ధ్రువ పత్రాలు లేని కారణంగా ఇటువంటి వారందరూ చిన్న చిన్న దుఖాణాలు, ఇళ్ళలో, పొలాలలో పనిచేసుకొంటూ జీవిస్తుంటారు. వారినందరినీ పట్టుకొని వెనక్కి తిప్పి పంపించివేయడానికి ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

Related Post