ధీం-తానాకు అందరికీ ఇదే ఆహ్వానం

February 20, 2017
img

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఫిలడెల్ఫియా ఆధ్వర్యంలో వచ్చే నెల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగబోతున్నాయి. టెల్ ఫోర్డ్ లోని 960, లాంగ్ మిల్ రోడ్డులో గల వెర్న్ ఫీల్డ్ ఎలిమెంటరీ స్కూల్లో మార్చి 25 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తానా అధ్యక్షుడు చౌదరీ జంపాల చెప్పారు. ఈ కార్యక్రమాల కోసం తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సతీష్ వేమన, తానా జాయింట్ సెక్రెటరీ రవి పొట్లూరి, కన్వీనర్ కూర్మంత చదలవాడ తదితరులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ధీం-తానా చైర్ గాయత్రి చింతకుంట, కన్వీనర్ గా కూర్మనాధ చదలవాడ వ్యవహరిస్తున్నారు. సతీష్ తుమ్మల (ఫోన్: 908-930-6735) మరియు సరోజ సాగరం (ఫోన్: 267-825-5677) ఈవెంట్ కో-ఆర్డినేటర్స్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమాలకు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవి-9, స్ప్రూస్ ఇన్ఫో టెక్(మై తెలంగాణా.కాం), కోవంట్ సోలూషన్స్, ఓటిస్ విజనరీ సొల్యూషన్స్ టు ఐటి, స్వర్ణ జ్యూవెల్స్, డెక్కన్ స్పైస్ హైదరాబాదీ ఇండియన్ కుషైన్ సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. 

ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. తానా 40వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది మే 26,27,28 తేదీలలో జరుగబోయే తానా సదస్సులో మళ్ళీ పోటీలు (ఫైనల్స్) నిర్వహించబడతాయి.  

ఈ కార్యక్రమాలలో (సోలో) పాటల పోటీలు, గ్రూప్ డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసస్ తానా పోటీలు నిర్వహించబడతాయి. వీటిలో పాల్గొనేందుకు ఆసక్తిగలవారు రిజిస్ట్రేషన్ మరియు పూర్తి వివరాల కోసం phillytana@gmail.com www.tana2017.org వెబ్ సైటును సందర్శించవచ్చు. 

Related Post