అమెరికా సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న వంశీ చందర్ అనే యువకుడిపై ఒక దండుగుడు కాల్పులు జరుపడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కాలిఫోర్నియాలో మిల్ పిటాస్ అనే ప్రాంతంలో ఒక అపార్టుమెంట్ పార్కింగ్ స్థలం వద్ద జరిగింది. వంశీ అక్కడికి వచ్చినప్పుడు గుర్తు తెలియని ఒక దుండగుడు పార్కింగ్ స్థలంలో ఉన్న ఒక కారుని అపహరించబోతుంటే వంశీ అడ్డుపడటంతో అతనిపైఆ దుండగుడు కాల్పులు జరిపి కారు తీసుకొని పారిపోయాడు. స్థానికుల సమాచారం అంది పోలీసులు అక్కడికి చేరుకొనేసరికే వంశీ తీవ్ర రక్తస్రావం కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది.
వరంగల్ జిల్లా వంగాపహాడ్ కు చెందిన వంశీ హైదరాబాద్ లో బీ.టెక్ పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్యల కోసం 2013 అమెరికా వెళ్ళాడు. ఇక నేడో రేపో చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తాడనుకొంటే అన్యాయంగా బలైపోయాడు. ఈ సంగతి తెలిసి అతని తల్లితండ్రులు పుట్టెడు దుఃఖంలో ములిగిపోయారు.