విదేశాలలో బతుకమ్మకి అరుదైన గౌరవం

December 20, 2016
img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజల సంస్కృతి సంప్రదాయాలను, పండుగలను పబ్బల ప్రాధాన్యతని అందరూ గుర్తించేలాగ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. కేవలం తెలంగాణాకే పరిమితమైన బతుకమ్మ పండుగని దేశవిదేశాలలో ప్రజలు కూడా గుర్తించి ఆధారించేందుకు తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కవిత చేస్తున్న కృషి గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమాలకు ఆ పండుగ ద్వారానే రాష్ట్ర మహిళల మద్దతు కూడా గట్టిగ ఘనురాలు కవిత. ఈ ఏడాది జరిగిన బతుకమ్మ పండుగను యూకె, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ తదితర  విదేశాలలో సైతం నిర్వహించడం ద్వారా ఆ పండుగ ప్రాశస్త్యం గురించి అందరికీ తెలిసేలా చేయగలిగారు.

యూరోపియన్ యూనియన్ లోని సభ్యదేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు ఒక్క డాలరు విలువగల బతుకమ్మ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చే క్లాస్ స్టాంపుని విడుదల చేశాయి. విశేషమేమిటంటే, దానిలో బతుకమ్మని ఎత్తిన కవిత చిత్రాన్ని ముద్రించడమే కాకుండా తెలుగులోనే బతుకమ్మ శుభాకాంక్షలు అని ముద్రించారు కూడా. ఆ దేశాలలో స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులలో తెరాస మద్దతుదారులు ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి ఈ స్టాంపుని విడుదల చేశారు. ఆస్ట్రేలియాలో తెరాస శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, ప్రధాన కార్యదర్శి అభిని కనపర్తి, తెలంగాణా జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, సభ్యులు నగేష్ రెడ్డి, రోహిత్ రావు, జమాల్ తదితరులు నిన్న హైదరాబాద్ లో తెలంగాణా భవన్ లో ఎంపి కవితను కలిసి ఆ స్టాంపులను అందజేశారు. ఆమె వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం గురించి దేశవిదేశాలకు తెలియజేయడానికి కవిత ఎంతగా కృషి చేయాగా, బతుకమ్మపై  విదేశీ ప్రభుత్వాలు స్టాంప్ విడుదల చేయడానికి ఎన్.ఆర్.ఐ.లు చేసిన కృషి చేసిన చాలా అభినందనీయం.  

Related Post