అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలో భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి (అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం 6.50 గంటలకి) 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. యురేకా తీరానికి సుమారు 100 మైళ్ళ దూరంలో 6.2 మైళ్ళ లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికన్ జియలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. సుమారు 20 సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించినట్లు సమాచారం. ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.