అతను భారత గూడచారి కాదు! తూచ్..అవునవును

December 08, 2016
img

ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రాకి చెందిన కులభూషణ్ యాదవ్ అనే ఒక వ్యక్తిని భారత్ గూడచారి అని ఆరోపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లో అరెస్ట్ చేసింది. కొన్ని రోజుల తరువాత అతని చేత ‘అవును నేను భారత గూడచారినే’ అని మీడియాకి చెప్పించింది. కానీ అతను గూడచారి అని రుజువు చేసేందుకు బలమైన సాక్ష్యాధారాలు ఏవీ దొరకలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సలదారు సర్తాజ్ అజీజ్ చెప్పినట్లు పాక్ మీడియాలోనే వార్తలు వచ్చాయి. మళ్ళీ అంతలోనే పాక్ విదేశాంగ శాఖ ఆ వార్తలని ఖండించింది.

“కులభూషణ్ యాదవ్ భారత్ కి చెందిన రీసర్చ్ అండ్ అనాలసిస్ గూడచర్య సంస్థ (’రా’)కి చెందిన వ్యక్తని నిరూపించేందుకు మా వద్ద అనేక ఆధారాలు ఉన్నాయి. ఆ విషయం అతనే స్వయంగా మీడియా ముందు ఒప్పుకొన్నాడు కూడా. అతను కరాచీ, బలూచిస్తాన్ లో ’రా’ తరపున గూడచర్యం చేస్తున్నట్లు మావద్ద సమాచారం ఉంది. ప్రస్తుతం ఆ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు అందిన తరువాతే అతనిపై తగు చర్యలు తీసుకొంటామని సర్తాజ్ అజీజ్ చెపితే దానిని మీడియా వక్రీకరించి వార్తలు ప్రచురించింది. వాటిని మేము ఖండిస్తున్నాము. పాక్ అంతరంగిక వ్యవహారాలలో భారత గూడచర్య సంస్థ జోక్యం చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాము. దీనిని ప్రపంచదేశాలు కూడా ఖంచాలని కోరుకొంటున్నాము,” అని పాక్ విదేశాంగ ప్రతినిధి అన్నారు. 

Related Post