అమెరికాలో సింగర్ చిత్ర సంగీత విభావరి

September 14, 2025
img

అమెరికాలో నివసిస్తున్న తెలుగువారికి ఓ శుభవార్త. ప్రముఖ తెలుగు సినీ గాయని కేఎస్ చిత్రగారు ఈ నెల 27 నుంచి అమెరికాలో పర్యటిస్తూ చిత్రలహరి పేరుతో సంగీత విభావరి నిర్వహించబోతున్నారు. 

ముందుగా సెప్టెంబర్‌ 27న వర్జీనియా, వియన్నాలోని ఓక్‌టన్‌ హైస్కూలులో జరుగబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 28న అట్లాంటాలో, అక్టోబర్ 4న చికాగోలో, అక్టోబర్ 26న సియాటెలలో సంగీత విభావరి నిర్వహించనున్నారు.  

అక్టోబర్ 4వ తేదీన చికాగోలోని 1635 ఇమర్సన్ లేన్, నేపర్‌విల్లె, ఐఎల్: 60540, చిత్రగారి సంగీత విభావరి జరుగబోతోంది. 

టికెట్స్ మరియు మరింత సమాచారం కొరకు: usa@shreyasgroup.net లేదా వాట్సప్ నంబర్: 91 84660 12345 లేదా యూఎస్ ఫోన్‌ నంబర్: +1 (847)722-1563ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. 

ఆమె సుమధుర గళంతో పాడే సినిమా, భక్తి పాటలు వినాలనుకునేవారు శ్రేయాస్ మీడియా వారి ఈ అధికారిక వెబ్‌సైట్‌: https://shreyas.media/virginia  ద్వారా పాసులు పొందవచ్చు.

Related Post