అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడంతో అనేక ఎగుమతులు ఎలాగూ నిలిచిపోయాయి. ఇప్పుడు పోస్టల్ సేవలు కూడా నిలిచిపోయాయి. అమెరికాలో లక్షల మంది భారతీయులున్నారు.
కనుక వారికి భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వారికి పచ్చళ్ళు, భారతీయ ఆహార పదార్ధాలు, ఇంకా రకరకాల వస్తువులు, వివిధ సందర్భాలలో చిన్న చిన్న కానుకలు, స్థిరాస్తి పత్రాలు, సర్టిఫికెట్స్ వంటివి పోస్టల్ సర్వీస్ ద్వారా పంపిస్తుంటారు.
కానీ ట్రంప్ సుంకాల ప్రభావం ఈ పోస్టల్ సర్వీసులపై కూడా పడింది. వంద డాలర్లకి మించి విలువ ఉండే పార్సిళ్ళపై సుంకాలు పెరిగాయి. కానీ ఎంతనేది ఇంకా స్పష్టత రాలేదు. పైగా ఈ అదనపు భారం ఎవరు భారించాలనేది స్పష్టత రాలేదు.
కనుక అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సర్వీసులు నిలిపివేయాలని భారత్ పోస్టల్ శాఖ నిర్ణయించింది. దీనిపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నామని త్వరలోనే మళ్ళీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.