ట్రంప్‌ సుంకాలు చట్ట విరుద్దం: ఫెడరల్ అప్పీల్స్ కోర్టు

August 30, 2025
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో సహా వివిద దేశాలపై ఆయన విధించిన భారీ సుంకాలు చట్ట విరుద్దమని తీర్పు చెప్పింది. 

మొత్తం 11 మంది న్యాయమూర్తులలో ఏడుగురు ఈ తీర్పుని సమర్ధించగా నలుగురు వ్యతిరేకించారు. అయితే దీనిపై ట్రంప్‌ ప్రభుత్వం అమెరికా సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది కనుక అంతవరకు అంటే అక్టోబర్ రెండో వారం వరకు పెంచిన ఈ సుంకాలను కొనసాగించేందుకు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అనుమతించింది. 

ఊహించినట్లే ఈ తీర్పుపై ట్రంప్‌ భగ్గు మన్నారు. ఇది అమెరికాకు నష్టం కలిగించే తీర్పుగా ట్రంప్‌ అభివర్ణించారు. దశాబ్ధాలుగా అమెరికా మిత్రదేశాలు, శత్రు దేశాలు కూడా అనైతికంగా లబ్ధి పొందుతూ అమెరికాకు తీరని నష్టం కలిగిస్తున్నాయన్నారు ట్రంప్‌. కనుక వాటి దోపిడీ నుంచి అమెరికాను, అమెరికన్ పరిశ్రమలను, అమెరికన్‌ కార్మికులను, ప్రజలను కాపాడుకునేందుకే ప్రపంచదేశాలపై ఈ సుంకాలు విధించాల్సి వచ్చిందని ట్రంప్‌ అన్నారు.

కానీ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు పక్షపాత వైఖరితో ఇచ్చిన ఈ తీర్పు దేశానికి చాలా నష్టం కలిగిస్తుందన్నారు. కనుక ఈ తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేసి అమెరికాకు న్యాయం చేస్తానని ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

Related Post