అమెరికాలో ప్రముఖ ఆర్ధికవేత్త రిచార్డ్ ఉల్ఫ్ భారత్‌పై ట్రంప్ సుంకాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ సుంకాల కారణంగా అమెరికాతో వాణిజ్యం చేయలేమని భారత్ భావిస్తే తప్పకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటుంది. అది బ్రిక్స్ దేశాలే అవుతాయి. తద్వారా వాటి మద్య బంధం మరింత బలపడుతుంది.
అవన్నీ పరస్పరం సహకరించుకుంటే అమెరికాకు ధీటుగా ఎదుగుతాయి. అంటే ట్రంప్ నిర్ణయాలు బ్రిక్స్ దేశాలు బలపడేందుకు దోహదపడతాయి. అంటే ట్రంప్ ఏం జరగొద్దని కోరుకున్నారో అదే జరిగేలా చేస్తున్నారన్న మాట. సోవియట్ కాలం నుంచి భారత్-అమెరికా మద్య బలమైన సంబంధాలున్నాయి. వాటిని ఈవిదంగా దెబ్బ తీసుకోవడం తగదు,” అని అభిప్రాయపడ్డారు.
బ్రిక్స్ దేశాలలో భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇండోనేషియా, యునైటడ్ అరబ్ ఎమిరేట్స్ ఇతోపియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా ఇవన్నీ వాణిజ్య ఒప్పందాలు చేసుకొని ఈ సమస్యని అధిగమించగలిగితే అప్పుడు నష్టపోయేది అమెరికాయే కదా? రిచార్డ్ ఉల్ఫ్ ఇదే చెప్పారు.