అమెరికాలో ఇస్కాన్ ఆలయంపై కాల్పులు

July 02, 2025
img

అమెరికాలో ఉతాహ్, స్పానిష్ ఫోర్క్ వద్ద గల ఇస్కాన్ ఆలయంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. అయితే వారు ఆలయ ప్రధాన ద్వారం, గోడలపై కాల్పులు జరిపి పారిపోయినందున లోపల ఉన్న భక్తులు, ఆలయ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరుగలేదు. దాదాపు 30 బుల్లెట్లు ఫైర్ చేసినట్లు స్థానిక పోలీస్ అధికారులు గుర్తించారు.

గత నెలలో కూడా కొందరు దుండగులు ఇదేవిదంగా ఆలయ గోడలపై తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయారు. ఆ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే మరోసారి ఈ దాడి జరిగింది.

దీనిపై ఆలయ అధ్యక్షుడు వాయ్ వార్డెన్ స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని మరోసారి జరుగకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా ఈవిషయం అందరి దృష్టికి తీసుకువెళ్ళారు.  

ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్‌కోలో భారతీయ దౌత్య కార్యాలయం కూడా తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, భక్తులకు, ఆలయ సిబ్బందికి తమ సహాయసహకారాలు అందిస్తామని, స్థానిక పోలీసులు తక్షణమే ఈ దాడులు జరిపినవారిని కనుగొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.    

  

Related Post