అమెరికా వెళ్ళి ఉన్నత విద్యాలభ్యసించాలని, అక్కడే ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని తహతహలాడేవారు లక్షల మంది ఉన్నారు. వారికి ఈ తాజా ఘటన కనువిప్పు కలిగిస్తుందని ఆశించవచ్చు. అమెరికాలో నెవార్క్ విమానాశ్రయంలో హరియాణ్వీ అనే ఓ భారతీయ విద్యార్ధిని అమెరికా పోలీసులు సంకెళ్ళు వేసి విమానాశ్రయానికి తీసుకువచ్చారు.
అతను ఆవేదనతో “నేను ఏ తప్పు చేయలేదు. నాకేమీ పిచ్చి లేడు. ఉందని నమమయించేందుకు ప్రయత్నిస్తున్నారు,” అంటూ గట్టిగా అరవడంతో పోలీసులు అతనిని నేలపై పడేసి చేతులు వెనక్కి విరిచి మోకాళ్ళతో అదిమిపెట్టారు.
విమానాశ్రయంలో అందరి ముందు వారు తనని ఆవిదంగా బందిస్తుంటే ఆ యువకుడు బాధ, అవమానం భరించలేక కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతనిని బేడీలు వేసి సోమవారం రాత్రి విమానంలో భారత్‌కు తిప్పి పంపారు.
అతనేమీ ఉగ్రవాది, సంఘవ్యతిరేకి కాదు. ఉన్నత విద్యాలభ్యసించడానికి వచ్చిన ఓ విద్యార్ధి. కానీ అమెరికా పోలీసులు ఓ కరడు గట్టిన ఉగ్రవాది పట్టుబడితే బందించినట్లు మీద పడి బందించడం చాలా దారుణం.
అమెరికాలో ఇది సర్వసాధారణమే కావచ్చు. కానీ పోలీసులలో, అమెరికా వ్యస్థలో మానవత్వం లోపించిందని చెప్పక తప్పదు. అదే.. ఓ అమెరికన్ పౌరుడిని భారత్‌లో ఆవిదంగా బందించి అవమానిస్తే అమెరికా సమాజం, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహించగలరా? భరించగలరా?
అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఓ వ్యక్తి, తన మొబైల్ ఫోన్‌తో హృదయ విదారకమైన ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ యువకుడిని ఓ నేరస్తుడిని బండించినట్లు బండించి తీసుకువెళుతుంటే అది చూసి అక్కడే ఉన్న నా హృదయం ముక్కలైపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవలసి వచ్చింది,” అని ఆ వీడియోలో పేర్కొన్నారు.
అమెరికాలో ఇండియన్ ఎంబసీ, భారత్ విదేశాంగ శాఖ దీనిపై స్పందించాలని కోరారు. కానీ వారు కూడా ఏమీ చేయలేరని అందరికీ తెలుసు. ఇటువంటి అవమానాలు ఎదురవుతుంటే ఇంకా అమెరికా వెళ్ళాలనుకోవడం అవివేకం కాదా? అందరూ ఆలోచించాల్సిన తరుణం ఇదే.
I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025