మే 7-9 మద్య భారత్, పాక్ మద్య యుద్ధం జరుగుతుంటే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్‌కు హడావుడిగా భారీగా రుణం మంజూరు చేసింది.
పాక్ ఉగ్రవాదంపై భారత్ పోరాడుతుంటే, ఐఎంఎఫ్ పాక్‌కు అత్యవసరంగా ఆర్ధిక సాయం అందించడాన్ని భారత్ తీవ్రంగా తప్పు పట్టింది.
దాంతో కంటి తుడుపు చర్యగా పాకిస్థాన్‌పై ఐఎంఎఫ్ కొత్తగా 11 ఆంక్షలు విధించింది. దీంతో ఐఎంఎఫ్ పాక్‌పై మొత్తం 50 ఆంక్షలు విధించనట్లయింది.
వాటిలో 2025-26 లో పాక్ రక్షణ బడ్జెట్ 12శాతం పెంచాలనే ప్రతిపాదనపై ఐఎంఎఫ్ ఆంక్షలు విధించింది. ఐఎంఎఫ్ సూచించిన విదంగానే నిధులు ఖర్చులు పెట్టాలని, దేశంలో ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధిపై పాక్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకొని సమర్పించాలని ఐఎంఎఫ్ షరతు విధించింది. ప్రభుత్వంలో సంస్థాగత మార్పులు కొన్ని సూచించింది.
అయితే ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని, భారత్ ఆగ్రహం అసహనం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నమే అని వేరే చెప్పక్కర లేదు. కానీ భారత్ దాడులలో ఉగ్రవాదులు చనిపోతే వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించిన పాక్ ప్రభుత్వం, ఐఎంఎఫ్ షరతులను పట్టించుకుంటుందా? అంటే కాదనే చెప్పవచ్చు.
ఐఎంఎఫ్‌ని మభ్యపెట్టి ఈ నిధులను పక్కదారి పట్టించక మానదు. అదే.. యుద్ధ సమయంలో పాకిస్థాన్‌కు ఆ నిధులు అందించకుండా కట్టడి చేసి ఉండొచ్చు కదా? ఓ పక్క లక్షల కోట్లు ఆర్ధిక సాయం అందిస్తూనే, ఆంక్షలు విధించామని చెపుతూ భారత్‌ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.. అంతే!