భారత్-పాక్ మద్య ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడినా పాక్ పాలకులు, సైన్యాధికారులు భారత్‌పై అణుబాంబులతో దాడి చేసి నేలమట్టం చేస్తామని బెదిరిస్తుంటారు. ఇప్పుడూ అదే అంటున్నారు.
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ ఇస్లామాబాద్‌లో పాక్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతానికి అణ్వస్త్ర ప్రయోగం గురించి ఆలోచించడం లేదు కానీ భారత్ దాడులు కొనసాగిస్తూ మా అవకాశాలను క్రమంగా తగ్గించేస్తుంటే అణ్వస్త్ర ప్రయోగం గురించి ఆలోచించక తప్పకపోవచ్చు. దీని కోసం ‘నేషనల్ కమాండ్ ఆధారిటీ’ సమావేశమైనట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లే. ఎటువంటి సమావేశం జరుగలేదు. కానీ జరిగినా జరగవచ్చు.
భారత్-పాక్ మద్య యుద్ధం మా రెండు దేశాలకే పరిమితమని ప్రపంచదేశాలు భావించకూడదు. ఈ యుద్ధం కొనసాగితే అణ్వస్త్ర ప్రయోగం జరిగినది అది ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందని గ్రహించాలి,” అని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ అన్నారు.