భారత్-పాకిస్థాన్ మద్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భారత్‌ని హెచ్చరిస్తున్నట్లు పాకిస్థాన్ వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. ఒకవేళ తమపై దాడి చేస్తే తాము కూడా భారత్‌పై క్షిపణులతో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నట్లే భావించవచ్చు.
కానీ తమ క్షిపణుల నావిగేషన్ సిస్టమ్స్, వాటి సాంకేతిక పరిమితుల పరీక్షించుకోవడానికే ఈ ప్రయోగాలు చేస్తున్నామని ఇప్పటి వరకు చేసిన మూడు ప్రయోగాలు విజయవంతం అయ్యాయని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. అవసరమైతే త్వరలోనే మరికొన్ని క్షిపణి ప్రయోగాలు చేపడతామని తెలిపింది.
పాక్ పరీక్షించిన క్షిపణి పేరు అబ్దాలీ. ఇది భూమి మీద నుంచి భూమి మీద 450 కిమీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. కరాచీ సముద్ర తీరం పక్కనే ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి వీటిని ప్రయోగిస్తోంది.
ఇటువంటి సమయంలో మధ్యవర్తులని ఆశ్రయించి ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాల్సిన పాకిస్థాన్, సరిహద్దుల వద్ద విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత్‌తో ప్రత్యక్ష యుద్ధానికి సై అంటోంది.
తరచూ భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఇస్లామాబాద్‌లో పాక్ మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ సింధూ నదీ జలాలను మళ్ళించేందుకు భారత్ దానిపై ఏవైనా ప్రాజెక్టులు కడితే వాటిని పేల్చేస్తాము. సింధూ జలాలపై పాక్ హక్కుని భారత్ నిరాకరించలేదు,” అని అన్నారు.