మా అణు బాంబులు భారత్‌ కోసమే: పాక్

April 27, 2025
img

భారత్‌-పాకిస్థాన్‌ మద్య ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రతీసారి పాక్ పాలకులు భారత్‌తో యుద్ధం.. దానిలో అణు బాంబుల ప్రయోగం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుంటారు. 

పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మన వద్ద 130 అణు బాంబులు వేర్వేరు రహస్య ప్రాంతాలలో అమర్చి ఉంచాము. ఇవికాక ఘోరీ, ఘజ్నవీ, షహీన్ వంటి బాలిస్టిక్ క్షిపణులు కూడా భారత్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ భారత్‌పై ప్రయోగించుకే తప్ప కేవలం ప్రదర్శన కోసం కాదు. 

కనుక భారత్‌ ఎటువంటి కవ్వింపు ప్రయత్నాలు చేసినా ధీటుగా జవాబు ఇస్తాము. సింధూ జలాలని భారత్‌ నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలి. ఇక ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. 

మనం రెండు రోజులు మన గగనతలం మూసేస్తే భారత్‌ విమానయాన సంస్థలన్నీ తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మరో పది రోజులు మూసేస్తే అన్నీ ఒక్కసారిగా దివాళా తీయడం ఖాయం. ఇప్పటికైనా భారత్‌ తన పరిస్థితి తెలుసుకొని మెసులుకుంటే మంచిది. 

భారత్‌ విధించిన ఆంక్షల వలన మనకీ కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది,” అని పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అన్నారు. 


Related Post