పాక్ నిర్ణయంతో విదేశీ ప్రయాణం మరింత భారం!

April 26, 2025
img

భారత్‌-పాక్ మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ఇరు దేశాలు పరస్పరం ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్‌లో ఢిల్లీ నుంచి గల్ఫ్, అమెరికా, యూరప్ దేశాలకు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా తదితర భారతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు, ఇంతవరకు పాకిస్థాన్‌ గగన తలం మీదుగా నేరుగా రాకపోకలు సాగిస్తున్నాయి. 

కానీ భారతీయ విమానాలకు తమ గగన తలంలోకి అనుమతించబోమని ప్రకటించడంతో ఇప్పడు చుట్టూ తిరిగి రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ కారణంగా విమాన ఇంధనం వాడకం పెరుగుతుంది కనుక అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ అదనపు ఛార్జీలు తప్పవు. విమాన టికెట్ ఛార్జీలు సుమారు 8-12 శాతం వరకు టికెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది. 

అదనపు గంటల ప్రయాణం చేయాల్సి వస్తున్నప్పుడు అదనపు చార్జీల భారం కూడా భరించవలసి రావడం చాలా బాధాకరమే కానీ తప్పదు. 

Related Post