జపాన్ లో బారీ భూకంపం, సునామి

November 22, 2016
img

ఆ చిన్న దేశానికి ఎప్పుడూ చాలా పెద్ద కష్టాలే వస్తుంటాయి. అదే...జపాన్ లో మళ్ళీ ఈరోజు తెల్లవారు జామున బారీ భూకంపం వచ్చింది. స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5.59 గంటలకి జపాన్ కి ఈశాన్యంలో పుకుషిమా నగరం పరిసర ప్రాంతాలలో 7.4 తీవ్రతతో బారీ భూకంపం సంభవించింది. అదే నగరంలో సముద్రతీరం పుకుషిమా అణువిద్యుత్ కేంద్రం కూడా ఉంది. భూకంపం కారణంగా సముద్ర జలాలు ఉవ్వెత్తున ఎగిసిపడి అణువిద్యుత్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం. కానీ దానికి ఎటువంటి ప్రమాదం ఏర్పడలేదు. దానిలో 3వ నెంబర్ రియాక్టర్ ప్లాంట్ ని కొంత సేపు నిలిపివేసి మళ్ళీ భూకంపం తీవ్రత తగ్గగానే ప్రారంభించారు. పుకుషిమా నగరానికి 37 కిమీ దూరంలో పసిఫిక్ సముద్ర గర్భంలో 11.4 కిమీ లోతున ఈ భూకంపకేంద్రం ఉన్నట్లు గుర్తించారు. జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలని జారీ చేసి, ఈశాన్యతీరం వెంబడి గల పట్టణాలలో ప్రజలని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తోంది. ఈ భూకంపం వలన ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.


Related Post