నాటా సభ్యులకి శ్రీధర్ గుడల వినతి

November 21, 2016
img

అమెరికాలో తెలుగువారికి శ్రీధర్ గుడల చిరపరిచితులే. అయన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ప్రారంభం నుంచి దానిలో జీవిత సభ్యుడుగా ఉన్నారు. నాటా తెలుగు స్టూడెంట్ ఎక్స్ చేంజ్ కమిటీకి వ్యవస్థాపక చైర్మన్ గా, నాటా రీజియనల్ కో-ఆర్డినేటర్, వైస్ ప్రెసిడెంట్-పిఎ.గా వ్యవహరిస్తున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్-ఇండియాకి ప్రధాన కార్యదర్శిగా, ఎస్.డబ్ల్యూ.ఓ.-అమెరికా నేషనల్ కో-ఆర్డినేటర్ గా, ఆత్మీయ సేవా ఆర్గనైజేషన్-ఇండియాకి అధ్యక్షుడుగా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ దిలావేర్ వ్యాలీ కార్యనిర్వాహక సభ్యుడుగా మరియు స్థానిక సాయి మందిరంలో కమ్యూనిటీ సర్వీసస్ లీడ్ గా సేవలు అందిస్తున్నారు. అంతకాదు...టిడిఎఫ్-అమెరికా మరియు విటిఎ-అమెరికాకి ఉపాధ్యక్షుడుగా సేవలు అందిస్తున్నారు. 

త్వరలో నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకాల కోసం ఎన్నికలు జరుగబోతున్నాయి. శ్రీధర్ గుడల దానికి పోటీ చేస్తున్నారు.. అమెరికాలో తెలుగు ప్రజలకి, ఉన్నత విద్యలభ్యసించేందుకు అమెరికా వస్తున్న తెలుగు విద్యార్ధులకి సేవలందిస్తున్న శ్రీధర్ గుడల తనని నాటా బోర్డ్ డైరెక్టర్ గా ఎన్నుకోవలసిందిగా నాటా జీవితకాల సభ్యులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నవంబర్ నెలాఖరుకల్లా నాటా బ్యాలెట్ పేపర్లు సభ్యుల ఇళ్ళకి పోస్ట్ ద్వారా పంపించబడతాయి.

Related Post