రష్యాతో గత మూడేళ్ళుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తూనే ఉంది. తాను అమెరికా అధ్యక్షుడినైతే 10 రోజులలో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టించేస్తానని డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. కనుక ఆ ఇరుదేశాలతో మద్యవర్తిత్వం చేస్తున్నారు.
అయితే ట్రంప్ అలవాటు ప్రకారం చిన్న మెలిక పెట్టారు. రష్యాని ఒప్పించి యుద్ధ విరమణ చేయించేందుకు ఉక్రెయిన్‌లో గల అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు అమెరికాని అనుమతిస్తూ ఒప్పంద పత్రాలపై సంతకం చేయాలని పట్టుపట్టారు.
దీని గురించి చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం వైట్ హౌస్ వచ్చారు. మీడియా సమక్షంలో ట్రంప్-ఉపాద్యక్షుడు జేడి వాన్స్-జెలెన్‌స్కీ ముగ్గురూ సమావేశమయ్యారు. ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్దంగా ఉన్నానని కానీ భవిష్యత్‌లో రష్యా మళ్ళీ ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా అమెరికా హామీ ఇవ్వాలని, ఒకవేళ దాడి చేస్తే తమకు అమెరికా రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ కోరారు.
దీనిపై ట్రంప్, జేడి వాన్స్ ఇద్దరూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారికి జెలెన్‌స్కీ కూడా ఘాటుగా బదులిచ్చారు. మేము ఎవరి మీద దండయాత్ర చేయలేదు. మా దేశంలో మేముంటే రష్యా మాపై దాడి చేసింది. అప్పుడు అమెరికా (మాజీ అధ్యక్షుడు జో బైడెన్)మాకు తోడ్పడినందుకు ధన్యవాదాలు. మా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కనుక నేను ఒత్తిళ్ళకు తలొగ్గను,” అని సూటిగా చెప్పేసరికి ప్రెసిడెంట్ ట్రంప్, జేడి వాన్స్ ఇద్దరూ మరింత ఆగ్రహంతో జెలెన్‌స్కీ తీరుని తప్పుపట్టారు.
జెలెన్‌స్కీ తీరు సరికాదని, మీరు ఉక్రెయిన్‌లోని లక్షలాది మంది జీవితాలతో చలగాటం ఆడుతున్నారని, మీ వలన మీ దేశానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఈవిదంగా వ్యవహరిస్తే మీకే నష్టమణి వారు జెలెన్‌స్కీని హెచ్చరించారు.
దౌత్యం ద్వారానే యుద్ధవిరమణ, శాంతి సాధ్యమని చెప్పగా ‘ఎలాంటి దౌత్యం?’ అని జెలెన్‌స్కీ ప్రశ్నతో ఇద్దరూ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ కలుగజేసుకొని “అమెరికా 350 బిలియన్ డాలర్ల ఆర్ధికసాయం, భారీగా ఆయుధాలు మీకు అందించి ఉండకపోతే వారం రోజులలోనే యుద్ధం ముగిసిపోయేది,” అనడంతో జెలెన్‌స్కీ కూడా “అవును రెండు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇదే మాటలు చెప్పారు,” అని ఘాటుగా బదులిచ్చారు.
దీంతో ట్రంప్ ఆగ్రహం పతాకస్థాయికి చేరింది. జెలెన్‌స్కీ ఈవిదంగా వ్యవహరిస్తున్నందున ఉక్రెయిన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం అసాధ్యం” అని తేల్చేశారు. జెలెన్‌స్కీ ధోరణి ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే మీడియా సమక్షంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని ట్రంప్ కుండ బద్దలు కొట్టారు.
చివరికి జెలెన్‌స్కీని వెంటనే వైట్ హౌస్ నుంచి బయటకు పొమ్మని ట్రంప్ చెప్పిన్నట్లు ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
Zelensky has nerves of steel 🔥
— Amock_ (@Amockx2022) February 28, 2025
Dream for Vishwaguru.pic.twitter.com/SiY6wBkOAS