అమెరికా నుంచి 205 మంది భారత్‌కి

February 05, 2025
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు అందరినీ వెనక్కి తిప్పి పంపించేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా లక్షల మంది నివసిస్తున్నారు. వారిలో 7.5 లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు.

 ట్రంప్ ఆదేశం మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్పటి వరకు 18,000 మంది భారతీయులను గుర్తించి వారిని భారత్‌కి తిప్పి పంపించడం ప్రారంభించారు. తొలి విడతలో 205 మందిని అమెరికా వాయుసేనకు  చెందిన విమానంలో ఈరోజు అమృత్‌సర్ విమానాశ్రయంకు తీసుకువచ్చి భారత్‌ ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. 

అమెరికాలో స్థిరపడాలనే మోజుతో అనుమతి లేకుండా అక్రమంగా నివసించడం తప్పే. కానీ అమెరికాలో ఒక్క భారతీయులే 7.5 లక్షల మంది ఉంటే, మిగిలిన దేశాలవారు ఇంకెన్ని లక్షల మంది ఉంటారో ఊహించడం కూడా కష్టం. మరి అన్ని లక్షల మంది ఉంటే, ఇలా యుద్ధ విమానాలలో 200 మంది చొప్పున వెనక్కు పంపిస్తుంటే ఎప్పటికీ అందరినీ పంపించగలరు?వారిని తిప్పి పంపించడానికి అమెరికా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది? అని ఆలోచిస్తే ట్రంప్ నిర్ణయం చాలా దుందుడుకుగా ఉన్నట్లే అనిపిస్తుంది. 

అయితే ఈవిదంగా అక్రమంగా నివసించడాన్ని భారత్‌ కూడా అంగీకరించదు. ప్రోత్సహించదని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వానికి భారత్‌ అన్ని విదాల సహకరిస్తుందని అన్నారు. 

Related Post