జన్మతః కుదరదు: సియాటెల్ కోర్టు

January 24, 2025
img

అందరూ ఊహించిన్నట్లే డోనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ అమెరికా అధ్యక్షుడుకాగానే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలో ఒకటి జన్మతః అమెరికన్ పౌరసత్వం రద్దు ఒకటి. అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారితో సహా చదువు, ఉద్యోగాలు, ఇతర కారణాలతో ఉంటున్నవారి పిల్లలకు జన్మతః అమెరికన్ పౌరసత్వం కల్పించాల్సిన అవసరం లేదంటూ డోనాల్డ్ ట్రంప్‌ తొలిరోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 

దానిపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులతో సహా వివిద దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో డెమోక్రాట్స్ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాలలో పిటిషన్లు వేశాయి కూడా. 

వాటిపై సియాటెల్ ఫెడరల్ కోర్టు విచారణ జరిపి ట్రంప్ ఆదేశాలు అమలుచేయకుండా తాత్కాలికంగా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులని తాము పైకోర్టులో సవాలు చేస్తామని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌ చెప్పారు. 

Related Post