డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా సోమవారం బాధ్యతలు చేపట్టగానే తన మార్క్ పాలన ప్రారంభించారు. వరుసపెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాలు చేస్తున్నారు. వాటికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం అవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యంతరం చెప్పినా ‘విటో’చేసి కొనసాగించుకోగలరు.
ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే తన ప్రాధాన్యత ‘అమెరికా ఫస్ట్’ అని విస్పష్టంగా చెప్పేశారు. అమెరికా, ఆమెరికన్స్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వాటి కోసం ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొనేందుకైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు.
అమెరికాలో జన్మించిన అక్రమ వలసదారుల పిల్లలకు అమెరికన్ పౌరసత్వం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 14వ సవరణని ట్రంప్ రద్దు చేశారు. 1868 లో అంతరయుద్దం తర్వాత శరణార్ధుల పిల్లలకు కోసం చేసిన ఈ సవరణ నేటికీ అవసరమా?అని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికా వలస విధానంలో ఇటువంటి మార్పులు మరిన్ని ఉండబోతున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.
దీని వలన అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడిన భారతీయులకు, హెచ్-1 బీ వీసాలతో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి పిల్లలకు ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు ఉండవు.
కానీ ట్రంప్ గతంలో అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇటువంటి వీసాలపై అనేక ఆంక్షలు విధించారు. కనుక ట్రంప్ మళ్ళీ అటువంటిదేదో చేయకుండా ఉండరు. ట్రంప్ ఎప్పుడు ఏం బాంబు పేలుస్తారో?